-
-
Home » Andhra Pradesh » Chittoor » Efforts for TDP victory in graduation elections-MRGS-AndhraPradesh
-
పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి
ABN , First Publish Date - 2022-10-12T05:08:33+05:30 IST
పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచెర్ల శ్రీకాంత్ విజ యానికి సైనికుల్లా పనిచేయాలని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లాబాబు పిలుపునిచ్చారు.

రొంపిచెర్ల, అక్టోబరు 11: పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచెర్ల శ్రీకాంత్ విజ యానికి సైనికుల్లా పనిచేయాలని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లాబాబు పిలుపునిచ్చారు. మంగళవారం రొంపిచెర్లలో పట్టభద్రుల ఓటర్ల నమోదుపై ఆయన సమీక్షిం చారు. సోమల మండలంలో సభ్యత్వ నమోదు తక్కువగా ఉందని ముమ్మరం చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు సుబ్రమణ్యంనాయుడిని కోరారు. అలాగే మండలంలో బాదుడే బాదుడు కార్యక్రమ నిర్వహణపై నాయకులు, కార్యకర్తల తో చర్చించి సమయం నిర్ణయించాలన్నారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గాల అక్రమ కేసులకు బయపడకుండా పార్టీ బలోపేతం కోసం పనిచేసి మళ్లి చంద్రబాబును ముఖ్య మంత్రిని చేద్దామన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు ఉయ్యాల రమణ, కొల్లా హరిప్రసాద్‌నాయుడు, ముల్లంగి వెంకట్ర మణ, ఎమ్మెల్సీ నియోజకవర్గ పోలింగ్ కో ఆర్డినేటర్ రామాంజులు, రొంపిచెర్ల క్టస్టర్ ఇన్‌చార్జి హరికృష్ణ పాల్గొన్నారు.