ఆర్టీసీ బస్సు నడుపుతూ డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2022-03-05T07:50:39+05:30 IST

ఆర్టీసీ బస్సు నడుపుతూ డ్రైవర్‌ మృతి చెందగా, ఓ ప్రయాణికుడి అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

ఆర్టీసీ బస్సు నడుపుతూ డ్రైవర్‌ మృతి

ఓ ప్రయాణికుడి అప్రమత్తతతో తప్పిన ప్రమాదం


చంద్రగిరి/చౌడేపల్లె, మార్చి 4: ఆర్టీసీ బస్సు నడుపుతూ డ్రైవర్‌ మృతి చెందగా, ఓ ప్రయాణికుడి అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  మదనపల్లె టూ డిపోకు చెందిన పల్లె వెలుగు అద్దె బస్సు తిరుపతి నుంచి పాకాల, పుంగనూరు మీదుగా మదనపల్లెకు బయల్దేరింది. ఈ బస్సును కాంట్రాక్టు డ్రైవరు, చౌడేపల్లెకు చెందిన బి.రామ్మూర్తి కుమారుడు రవి(35) నడుపుతున్నాడు. చంద్రగిరి మండలంలోని అగరాల వద్దకు బస్సు రాగానే డ్రైవర్‌ మూర్ఛ  పోవడంతో వాహనం అదుపుతప్పింది. దీన్ని గమనించిన ఓ ప్రయాణికుడు అప్రమత్తమై బస్సు స్టీరింగ్‌ కంట్రోల్‌ చేసి, బ్రేక్‌ వేశాడు. దాంతో బస్సులోని సుమారు 50 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే డ్రైవర్‌ మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-03-05T07:50:39+05:30 IST