ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు : కిలివేటి

ABN , First Publish Date - 2022-09-17T05:30:00+05:30 IST

గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజల వద్దకే సంక్షేమం, అభివృద్ధి ఫలాలు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా చేరుతున్నాయని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు.

ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు : కిలివేటి

నాయుడుపేట, సెప్టెంబరు17: గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజల వద్దకే సంక్షేమం, అభివృద్ధి ఫలాలు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా చేరుతున్నాయని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నాయుడుపేట గెరిడీవీధి, ఎల్‌ఏ సాగరంలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిన వివిధ పథకాలను వివరించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కటకం దీపిక, ఎంపీపీ ధనలక్ష్మి,  ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కట్టా రమణారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ సుందరరెడ్డి, సహకార సంఘ మాజీ అధ్యక్షుడు రాజారెడ్డి, టీఎంఆర్‌ ఇన్‌ఫ్రా అధినేత తంబిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ మాధవరెడ్డి, వైస్‌చైర్మన్‌ వెంకటకృష్ణారెడ్డి, ఎఎంసీ చైర్మన్‌ రాధాకిషోర్‌యాదవ్‌, చదలవాడ కుమార్‌, కరీంబాయి చెంచయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

Read more