పద్మావతీదేవికి కాసులహారం కానుక
ABN , First Publish Date - 2022-08-04T06:48:38+05:30 IST
శ్రీవారి దేవేరి పద్మావతీ దేవికి సుమారు రూ. 12లక్షల విలువైన బంగారు కాసుల హారాన్ని ఓ భక్తుడు కానుకగా అందజేశారు.
తిరుచానూరు, ఆగస్టు 3: శ్రీవారి దేవేరి పద్మావతీ దేవికి సుమారు రూ. 12లక్షల విలువైన బంగారు కాసుల హారాన్ని ఓ భక్తుడు కానుకగా అందజేశారు. తిరుచానూరుకు చెందిన బలరాంనాయుడు దంపతులు బుధవారం 230గ్రాముల బరువుగల బంగారు కాసులమాలను ఆలయ ప్రాంగణంలో డిప్యూటీ ఈవో లోకనాథానికి అందజేశారు. విశేష పర్వదినాల్లో అమ్మవారికి ఈ కాసుల హారాన్ని అలంకరించనున్నట్లు అర్చకులు బాబుస్వామి తెలిపారు.తిరుపతికి చెందిన పొన్నాల సుధాకర్ 9హుండీ వస్త్రాలను విరాళంగా అందజేశారు. ఏఈవో ప్రభాకర రెడ్డి, మధు, దామోదరం తదితరులు పాల్గొన్నారు.