నేడు ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపు

ABN , First Publish Date - 2022-03-05T07:51:21+05:30 IST

తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట వద్ద ఉన్న వంతెనకు అర్బన్‌ పోలీసుల సహకారంతో శనివారం మరమ్మతులు పనులు జరగనున్నాయి.

నేడు ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపు

తిరుపతి(కొర్లగుంట), మార్చి 4: తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట వద్ద ఉన్న వంతెనకు అర్బన్‌ పోలీసుల సహకారంతో శనివారం మరమ్మతులు పనులు జరగనున్నాయి. తెల్లవారు జామున నాలుగు నుంచి సాయంత్రం నాలుగు గంటలకు ఈ పనులు చేయనున్నారు. అందువల్ల తిరుపతి బస్టాండు నుంచి పడమర దిశగా ప్రయాణించే ఆర్టీసీ బస్సుల రాకపోకలను దారి మళ్లించారు. పీలేరు, మదనపల్లె, రాయచోటి, పుంగనూరు, అనంతపురం, చిత్తూరు, వేలూరు, బెంగళూరు వైపు వెళ్లే బస్సులు తిరుపతి బస్టాండు నుంచి అలిపిరి, జూపార్కు మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. ప్రయాణికులు గమనించి సహకరించాలని అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ డి.రామచంద్రనాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

Read more