విద్యార్థులకు 21నుంచి ట్యాబ్‌ల పంపిణీ
ABN , First Publish Date - 2022-12-16T01:12:40+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు, టీచర్లకు బైజూస్ ప్రీమియం కంటెంట్‌తో ప్రీలోడ్ చేయబడిన ట్యా బ్‌లను ఈనెల 21నుంచి 27వతేదీవరకు పంపిణీ చేస్తున్నట్లు డీఈవో వి.శేఖర్ తెలిపారు.
తిరుపతి(విద్య), డిసెంబరు15: ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు, టీచర్లకు బైజూస్ ప్రీమియం కంటెంట్‌తో ప్రీలోడ్ చేయబడిన ట్యా బ్‌లను ఈనెల 21నుంచి 27వతేదీవరకు పంపిణీ చేస్తున్నట్లు డీఈవో వి.శేఖర్ తెలిపారు. గురువారం ఈ అంశంపై ఆయన తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాకు 21,422 (విద్యార్థులకు 18,829, టీచర్లకు 2593) ట్యాబ్‌ల అవసరం ఉండగా.. తొలివిడతగా చేరిన 61,20 వచ్చాయని, వీటిని మండలకేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. మరో రెండ్రోజుల్లో మిగిలిన 15,302 ట్యాబ్‌లు పంపించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు.