గజరాజుల జెండా ప్రదర్శన

ABN , First Publish Date - 2022-08-15T08:06:55+05:30 IST

రామకుప్పం: మండలంలోని కౌండిన్య ఎలిఫెంట్‌క్యాంపులో ఆదివారం శిక్షణ పొందిన గజరాజులు జాతీయ పతాకాలను తమ తొండాలతో రెపరెపలాడించాయి.

గజరాజుల జెండా ప్రదర్శన

రామకుప్పం: మండలంలోని కౌండిన్య ఎలిఫెంట్‌క్యాంపులో ఆదివారం శిక్షణ పొందిన గజరాజులు గణేష్‌, వినాయక్‌ నుదిట జాతీయపతాక చిహ్నాలను చిత్రించారు. జాతీయ పతాకాలను గజరాజులు తమ తొండాలతో రెపరెపలాడించాయి. 


వంద అడుగుల త్రివర్ణ దేశపటం 

కుప్పం సమీపం శెట్టిపల్లెలోని చిన్నస్వామి డిఫెన్స్‌ అకాడమీ మైదానంలో ఆదివారం వంద అడుగుల పొడవున ఉప్పుతో భారత దేశ పటాన్ని రూపొందించారు. మధ్యలో అశోక చక్రంతోపాటు త్రివర్ణాలతో దేశ భక్తిని చాటేలా తీర్చిదిద్దారు. 


జలాసనం వేసి.. జెండా ఎగురవేసి.. 

పుంగనూరు సమీపంలోని బావిలో బీజేపీ నేత అయూబ్‌ఖాన్‌, విశ్రాంత ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం ఆదివారం జలాసనం వేశారు. అలా.. నీళ్లలో నుంచి జాతీయ జెండా ఎగురవేస్తూ దేశభక్తి చాటారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఇలా నీళ్లలోనూ మువ్వన్నెల జెండా ఎగుర వేయడం గమనార్హం.

Read more