రూ.2346 కోట్ల పంట రుణాల పంపిణీ

ABN , First Publish Date - 2022-09-11T07:58:06+05:30 IST

వార్షిక రుణ ప్రణాళిక మేర ప్రస్తుత ఖరీఫ్‌ పంటకాలంలో ఇంతవరకు రూ.2346.33 కోట్ల పంట రుణాలను పంపిణీ చేసినట్లు జిల్లా లీడ్‌ డిస్ట్రిక్‌ మేనేజరు ఎం.శేషగిరిరావు తెలిపారు.

రూ.2346 కోట్ల పంట రుణాల పంపిణీ

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 10: వార్షిక రుణ ప్రణాళిక మేర ప్రస్తుత ఖరీఫ్‌ పంటకాలంలో ఇంతవరకు రూ.2346.33 కోట్ల పంట రుణాలను పంపిణీ చేసినట్లు జిల్లా లీడ్‌ డిస్ట్రిక్‌ మేనేజరు ఎం.శేషగిరిరావు తెలిపారు. చిత్తూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబరు నెలతో పూర్తయ్యే ఖరీఫ్‌ పంటకాలానికి మరిన్ని పంటరుణాలు ఇవ్వాలని జిల్లా బ్యాంకర్ల సంఘం సూచించిందని తెలిపారు. ట్రాక్టర్లు, పాడిపశువులు కొనుగోలు, గోదాముల నిర్మాణాలు, ఆగ్రో బేస్డ్‌ పరిశ్రమల స్థాపనకు మామిడి తోటలకు ఈ ఏడాది రూ.623.55 కోట్ల దీర్ఘకాలిక రుణ వితరణ లక్ష్యంకాగా.. ఇప్పటి వరకు రూ.502.55 కోట్లను 10,922 మంది లబ్ధిదారులకు పంచినట్లు వివరించారు. ఇండియన్‌ బ్యాంకు జిల్లాలో 26 శాఖలతో కొనసాగుతుండగా ఆర్బీఐ సలహామేర పెద్దపంజాణి మండలం పెద్దకాపల్లిలో త్వరలో నూతన శాఖ ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. 

Updated Date - 2022-09-11T07:58:06+05:30 IST