AP News: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ఈవో తీరుపై భక్తుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-10-07T22:16:50+05:30 IST

Tirupati: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ఈవో త్రినాథరావు తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆలయ నిబంధనలకు తూట్లు పొడిచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దసరా బ్రహ్మోత్సవాలు, వేడుకల ముగింపు సం

AP News: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ఈవో తీరుపై భక్తుల ఆగ్రహం

Tirupati: ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) చిన్న వెంకన్న ఆలయ ఈవో త్రినాథరావు తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆలయ నిబంధనలకు తూట్లు పొడిచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దసరా బ్రహ్మోత్సవాలు, వేడుకల ముగింపు సందర్భంగా ద్వారకా తిరుమలకు భక్తులు పోటెత్తారు. భారీ జన సందోహం.. వేలాది భక్తుల మధ్యలోంచి.. అనివేటి మండపం గుండా ఈవో కారును తీసుకెళ్లి తూర్పు రాజగోపురం పక్కన పార్క్ చేశారు. ఈ ఘటనపై పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్వారకా తిరుమలకు వచ్చే ప్రజాప్రతినిధులు, వీఐపీలు, అధికారులు జంట గోపురాల వద్ద కారు పార్క్ చేసి బ్యాటరీ కారు లేదా కాలినడకన ఆలయానికి చేరుకుంటారు. ఆలయ చైర్మన్ ఎస్‌వి సుధాకర్ రావు సైతం బ్యాటరీ కారులోనే తూర్పు రాజగోపురం ప్రాంతానికి వస్తారు. గతంలో దేవాదాయ శాఖ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆలయానికి వచ్చి..తన కార్లను అక్కడే పార్క్ చేయడంతో అప్పట్లో పెద్ద వివాదం చెలరేగింది.

Read more