డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-06T05:10:36+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.

డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు ప్రారంభం

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 5: ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం వరకు కొనసాగుతాయి. ఇందుకోసం చిత్తూరు, నారాయణవనం, చంద్రగిరి, రేణిగుంటల్లో ఒక్కొక్కటి చొప్పున, తిరుపతిలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రతి రోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు జిల్లా కో- ఆర్డినేటర్‌గా డీఆర్వో రాజశేఖర్‌ను కలెక్టర్‌ నియమించారు.

Read more