రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2022-08-05T05:00:54+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన పుంగనూరు మండలంలో జరిగింది.
పుంగనూరు రూరల్, ఆగస్టు 4: రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన పుంగనూరు మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. రామసముద్రం మండలం అరికెల పంచాయతీ యల్లంపల్లెకు చెందిన లోకనాథంరెడ్డి కుమారుడు విక్రమ్‌రెడ్డి(19), టి.గొల్లపల్లెకు చెందిన సంపత్ స్నేహితులు. వీరు పుంగనూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గురువారం సాయంత్రం తరగతులు ముగించుకుని ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళుతుండగా పట్రపల్లి వద్ద ఓ ప్రైవేటు స్కూల్ బస్సును ఢీకొన్నారు. ఈ ఘటనలో విక్రమ్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. సంపత్ ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న కుంటుబసభ్యులు వెంటనే సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. ఎస్ఐ మోహన్‌కుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.