ఆత్మహత్యకు పాల్పడిన మహిళ మృతి

ABN , First Publish Date - 2022-10-07T06:23:45+05:30 IST

తవణంపల్లె మండలం ఎం.బోయపల్లె కాలనీకి చెందిన రంగమ్మ(50) ఆదివారం ఆత్మహత్యకు యత్నించారు.

ఆత్మహత్యకు పాల్పడిన మహిళ మృతి
మృతురాలు రంగమ్మ

తవణంపల్లె, సెప్టెంబరు 6: తవణంపల్లె మండలం ఎం.బోయపల్లె కాలనీకి చెందిన రంగమ్మ(50) ఆదివారం ఆత్మహత్యకు యత్నించారు. చుట్టుపక్కల వారు ఆమెను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గరువారం మృతి చెందారు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె.. నొప్పి ఎక్కువ కావడంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సుబ్రహ్మణ్యంనాయుడు తెలిపారు. ఈ మేరకు మృతురాలి కుమారుడు వెంకటరాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. 


Read more