రెండు రోజులుగా ఇంట్లోనే శవం

ABN , First Publish Date - 2022-11-24T00:51:22+05:30 IST

స్తి తగాదాల నేపథ్యంలో రెండు రోజులుగా ఇంట్లోనే శవం ఉంచేశారు. పోలీసుల రంగప్రవేశంతో ఎట్టకేలకు బుధవారం సాయంత్రం అంత్యక్రియలు జరిపారు.

రెండు రోజులుగా ఇంట్లోనే శవం
గురవయ్య మృతదేహం

ఆస్తి తగాదాలే కారణం.. పోలీసుల సర్దుబాటుతో అంత్యక్రియలు

కార్వేటినగరం, నవంబరు 23: ఆస్తి తగాదాల నేపథ్యంలో రెండు రోజులుగా ఇంట్లోనే శవం ఉంచేశారు. పోలీసుల రంగప్రవేశంతో ఎట్టకేలకు బుధవారం సాయంత్రం అంత్యక్రియలు జరిపారు. ఈ ఘటన కార్వేటినగరం పంచాయతీ పరిధిలోని అప్పచారి వీధిలో జరిగింది. ఈ వీధిలో నివాసం ఉంటున్న గురువయ్య మందడి (80) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందారు. ఈయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కుమారుడు ఇతడి ఆస్తిని మొత్తం రాయించుకున్నాడంటూ రెండో భార్య ఇద్దరు కుమార్తెలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి విషయం తేలేవరకు శవం కదిలించకూడదని వీరు పట్టుపట్టారు. వీరి ఆస్తి తగాదాతో రెండు రోజులుగా శవం ఇంట్లోనే ఉండిపోయింది. పోలీసులు ఇరు వర్గాలను ఒప్పించడంతో బుఽధవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి.

Updated Date - 2022-11-24T00:51:22+05:30 IST

Read more