-
-
Home » Andhra Pradesh » Chittoor » Cultivation of new grains in fallow lands should be encouraged-NGTS-AndhraPradesh
-
బీడు భూముల్లో నవధాన్యాల సాగును ప్రోత్సహించాలి
ABN , First Publish Date - 2022-09-17T06:56:40+05:30 IST
బీడు భూముల్లో నవధాన్యాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు రఘునాథరెడ్డి సూచించారు.

వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు
‘డ్రిప్’ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: జేసీ
తిరుపతి(కొర్లగుంట), సెప్టెంబరు 16: బీడు భూముల్లో నవధాన్యాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు రఘునాథరెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన ప్రసంగించారు. టీటీడీ ఇప్పటికే రైతు సంఘాలతో ఎంవోయూలను కుదుర్చుకుని 12రకాల ధాన్యాలను 15శాతం అదనపు ధరతో కొనుగోలు చేస్తోందన్నారు. అలాగే గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రా (ఆర్బీకే)ల్లోనే విత్తు నుంచి విక్రయం వరకు జరగాలన్నారు. జేసీ బాలాజి మాట్లాడుతూ.. డ్రిప్ వ్యవస్థను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఐదెకరాల్లోపున్న రైతులకు 90శాతం, పదెకరాల్లోపున్న వారికి 70శాతం సబ్సిడీతో పరికరాలను అందిస్తున్నట్లు తెలియజేశారు. స్ర్పింక్లర్లకు కూడా 55శాతం సబ్సిడీగా ఇస్తున్నట్లు గుర్తుచేశారు. మల్బరీ, ఆయిల్‌ఫాం సాగుపై రైతులు మొగ్గు చూపాలని కోరారు. వ్యవసాయ శాఖాధికారి దొరసాని, పశుసంవర్ధకశాఖ అధికారులు వెంకటేశ్వర్లు, హార్టికల్చర్ అధికారి దశరథరామిరెడ్డి, సెరికల్చర్ అధికారి గీతారాణి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులు, అనుబంధశాఖల అధికారులు పాల్గొన్నారు.