కిటకిటలాడిన బోయకొండ

ABN , First Publish Date - 2022-09-26T05:17:44+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం గంగమ్మ కిటకిటలాడింది.

కిటకిటలాడిన బోయకొండ

చౌడేపల్లె, సెప్టెంబరు 25: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం గంగమ్మ కిటకిటలాడింది. ఉదయం  అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి, అమ్మవారికి ప్రీతికరమైన వేపాకు తోరణాలతో ఆలయాన్ని అలంకరించారు. అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేసి  స్వర్ణాభరణాలతో, పూలతో అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.  ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే  కాకుండా తమిళనాడు, కర్ణాటకల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని చిత్తూరు ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్‌  శంకర్‌నారాయణ,  ఈవో చంద్రమౌళి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.Read more