మహిళా వర్సిటీలో పరిశోధనలకు సహకారం
ABN , First Publish Date - 2022-07-03T07:14:51+05:30 IST
పద్మావతి మహిళా వర్సిటీలో చేపట్టే పరిశోధనలు, ప్రాజెక్టులకు సహకారం అందిస్తామని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీ్‌షరెడ్డి పేర్కొన్నారు.

విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టులకు అవకాశమిస్తాం
డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీ్‌షరెడ్డి
తిరుపతి(విద్య), జూలై 2: పద్మావతి మహిళా వర్సిటీలో చేపట్టే పరిశోధనలు, ప్రాజెక్టులకు సహకారం అందిస్తామని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీ్‌షరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని వర్సిటీలో ఎండోమెంట్ సిరీస్ ఆన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఇన్ ది ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షి్పను శనివారం ఆయన ముఖ్య అతిఽథిగా ప్రారంభించగా, తిరుపతి పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి... డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీ్‌షరెడ్డి మాట్లాడుతూ.. కొత్త ఆవిష్కరణలలో వర్సిటీ ముందంజలో ఉందని, రెండేళ్లలో 51 పేటెంట్లు తెచ్చుకోవడం అభినందనీయమన్నారు. హెచ్ ఇండెక్స్‌లో ప్రపంచ పరిశోధనా రంగంలోని 100 మంది శాస్త్రవేత్తల్లో వర్సిటీకి చెందిన 12మంది ప్రొఫెసర్లు ఉండడం గొప్ప విషయమని అన్నారు. వర్సిటీలో చదివే విద్యార్థులకు తమ సంస్థ తరఫున ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టులు చేయడానికి అవకాశం కల్పిస్తామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఉందని, నూతన విధానంలో బోధన, ఆవిష్కరణల దిశగా అధ్యాపకులు పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. వర్సిటీలో బయోటెక్నాలజీ విభాగంలో నాలుగు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు డీఆర్డీవోకు పంపగా అందులో రెండింటికి అనుమతి లభించగా, మిగిలిన వాటికి అనుమతి ఇవ్వాల్సిఉందని గుర్తు చేశారు. వీసీ జమున, రిజిస్ర్టార్ మమత, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.