రూ.180 కోట్లతో 24 ప్రభుత్వాస్పత్రుల నిర్మాణం

ABN , First Publish Date - 2022-10-11T06:49:12+05:30 IST

ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో రూ.180 కోట్లతో 24 ప్రభుత్వాస్పత్రుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్లు ఏపీఎంఎ్‌సఐడీసీ ఎస్‌ఈ చిట్టిబాబు తెలిపారు.

రూ.180 కోట్లతో 24 ప్రభుత్వాస్పత్రుల నిర్మాణం

ఏపీఎంఎ్‌సఐడీసీ ఎస్‌ఈ చిట్టిబాబు


పీలేరు, అక్టోబరు 10: ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో రూ.180 కోట్లతో 24 ప్రభుత్వాస్పత్రుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్లు ఏపీఎంఎ్‌సఐడీసీ ఎస్‌ఈ చిట్టిబాబు తెలిపారు. పీలేరులో నిర్మితమవుతున్న 100 పడకల ఆస్పత్రి భవనాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు, శ్రీకాళహస్తి, రాయచోటి, పలమనేరు, పులివెందులలో నిర్మిస్తున్నవి 100 పడకల ఆస్పత్రులు కాగా మిగిలినవి 30, 50 పడకల ఆస్పత్రులని తెలిపారు. వీటన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామని తెలిపారు. రూ.550 కోట్లతో పులివెందులలో, రూ.475 కోట్లతో మదనపల్లెలో వైద్య కళాశాలల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఏపీఎంఎ్‌సఐడీసీ ఈఈ ధనంజయరెడ్డి, డీఈ కరీముల్లా ఖాన్‌ పాల్గొన్నారు.

Read more