నాగుపాము, జెర్రిపోతు పట్టివేత

ABN , First Publish Date - 2022-05-27T07:20:57+05:30 IST

నాగుపాము, జెర్రిపోతులను పట్టుకున్నారు.

నాగుపాము, జెర్రిపోతు పట్టివేత
పాములను చూపుతున్న భాస్కర్‌నాయుడు

తిరుమల, మే 26 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని పాండవ అతిథిగృహం వెనుకభాగం నుంచి సుమారు ఆరడుగుల పొడవున్న నాగుపాము జనసంచారంలోకి వచ్చింది. సమాచారం అందుకున్న టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి, పాములు పట్టే భాస్కర్‌ నాయుడు హుటాహటిన అక్కడికి చేరుకున్నాడు. తన వద్దనున్న పరికరాలతో పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అలాగే జీఎన్సీ టోల్‌గేట్‌ వద్ద ఆరున్నర అడుగుల పొడవున్న జెర్రిపోతు పామును కూడా ఆయన పట్టుకున్నారు. అనంతరం రెండు పాములను అవ్వాచారి కోనలోయలో విడిచిపెట్టారు. 

Updated Date - 2022-05-27T07:20:57+05:30 IST