బీసీలపై సీఎం జగన్‌ బూటక ప్రేమ

ABN , First Publish Date - 2022-12-07T00:05:57+05:30 IST

బీసీలపై సీఎం జగన్‌ ఒలకబోస్తున్న ప్రేమంతా బూటకమని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి గౌనివారిశ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఆయన శాంతిపురంలో మీడియాతో మాట్లాడుతూ బీసీల హత్యలతో ఎదిగిన జగన్‌ కుటుంబం బీసీలను ఉద్దరిస్తుందా అని ఆయన ప్రశ్నించారు.

బీసీలపై సీఎం జగన్‌ బూటక ప్రేమ

రామకుప్పం, డిసెంబరు 6: బీసీలపై సీఎం జగన్‌ ఒలకబోస్తున్న ప్రేమంతా బూటకమని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి గౌనివారిశ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఆయన శాంతిపురంలో మీడియాతో మాట్లాడుతూ బీసీల హత్యలతో ఎదిగిన జగన్‌ కుటుంబం బీసీలను ఉద్దరిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు పాతరేసి 16,800మందిని రాజ్యాధికారానికి దూరం చేశారన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.34వేల కోట్లను దారి మళ్లించారన్నారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన అన్ని పథకాలను బీసీలపై ఈర్ష్యా, కక్ష, ద్వేషాలతో రద్దు చేశారన్నారు. కీలకమైన నామినేటెడ్‌ పదవుల పంపకంలో బీసీలకు మొండిచేయి చూపారన్నారు. జగన్‌ పాలనలో ఇప్పటి వరకు 26మంది బీసీ నేతలు హత్యలకు గురయ్యారని, 650మందిపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయన్నారు. 2500మందిని తప్పుడు కేసులతో వేధించారన్నారు. రాష్ట్రంలో బీసీలకు చెందిన 8వేల ఎకరాల భూములను వైసీపీ మూకలు లాక్కున్నాయన్నారు. బీసీ మంత్రుల శాఖలకు సంబందించి ఆయా శాఖల మంత్రులేకుండా సజ్జల మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. బీసీ మంత్రుల వెనుక షాడోగా రెడ్లను నియమించడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఐదుభాగాలు చేసి విజయసాయిరెడ్డి, వైవీసుబ్బారెడ్డి, సజ్జలరామకృష్ణారెడ్డి, వేమిరెడ్డిప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, ఆళ్ళరామకృష్ణారెడ్డిలకు పంచిపెట్టారన్నారు. జగన్‌కు సలహాదార్లుగా ఏ ఒక్క బీసీ నేతకు అర్హత లేదా అని ఆయన ప్రశ్నించారు. సలహాదారులు, వీసీలు, ప్రధాన నామినేటెడ్‌ చైర్మన్‌ పోస్టుల్లో రెడ్లను మాత్రమే నియమించారన్నారు. 56 బీసీ కార్పొరేషన్లను అలంకారప్రాయంగా మార్చడమే కాకుండా నిరుద్యోగ యువత, మహిళలకు తీరని అన్యాయం చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి బీసీలు బుద్ధి చెప్పి శంకరగిరిమాన్యాలు పట్టించడం ఖాయమన్నారు.

Updated Date - 2022-12-07T00:06:01+05:30 IST