మహిషాసురమర్ధిని అలంకారంలో చెంగాళమ్మ

ABN , First Publish Date - 2022-10-07T07:14:57+05:30 IST

సూళ్లూరుపేటలో జరుగుతున్న శరన్నవరాత్రుల వేడుకల్లో చివరిరోజైన బుధవారం విజయదశమి కావడంతో మహిషాసురమర్థిని అలంకారంలో చెంగాళమ్మ పరమేశ్వరి భక్తులకు దర్శనమిచ్చారు.

మహిషాసురమర్ధిని అలంకారంలో చెంగాళమ్మ

సూళ్లూరుపేట, అక్టోబరు 6:సూళ్లూరుపేటలో జరుగుతున్న శరన్నవరాత్రుల వేడుకల్లో చివరిరోజైన బుధవారం విజయదశమి కావడంతో మహిషాసురమర్థిని అలంకారంలో చెంగాళమ్మ పరమేశ్వరి  భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అభిషేకం అనంతరం విశేష పూజలు చేశారు.మహా  చండీయాగాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన శింగన ఓబుల్‌ రెడ్డి, పద్మజ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అలం కార ఉభయకర్తలుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ప్రశాంతి దంపతులు వ్యవహరించారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. చివరిరోజు సారెతోపాటు, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సమర్పించారు. ఆలయ చైర్మన్‌ దువ్వూ రు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాస రెడ్డి ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. 

Read more