గాయత్రీ దేవిగా చెంగాళమ్మ

ABN , First Publish Date - 2022-09-29T06:30:52+05:30 IST

సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రుల వేడుకల్లో బుధవారం గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

గాయత్రీ దేవిగా చెంగాళమ్మ

సూళ్లూరుపేట, సెప్టెంబరు 28 : సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రుల వేడుకల్లో బుధవారం గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి విశేషపూజలతో పాటు అభిషేకం చేశారు.యాగశాల మండపంలో మహా చండీయాగాన్ని నిర్వహించారు.అమ్మవారి మెట్టినిల్లుగా భావించే మన్నారుపోలూరు, నూకలపాళెం గ్రామస్తులు అమ్మణ్ణికి సారె సమర్పించారు. మన్నారుపోలూరులోని  చెంగాళమ్మ ఆలయంవద్ద నుంచి మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీమంత్‌రెడ్డి, గ్రామస్తులు మేళతాళాల నడుమ సారె తీసుకొచ్చారు. వారికి ఆలయ ఛైర్మన్‌ బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికారు.  

Read more