జిల్లా సైన్స్‌ అధికారిగా భానుప్రసాద్‌

ABN , First Publish Date - 2022-08-09T07:32:56+05:30 IST

తిరుపతి జిల్లా విద్యాశాఖ సైన్స్‌ అధికారిగా వడమాలపేట మండలంలోని తడుకు ఆర్‌ఎస్‌ జిల్లాపరిషత్‌ హైస్కూల్‌ సైన్స్‌ టీచర్‌ కె.భానుప్రసాద్‌ నియమితులయ్యారు.

జిల్లా సైన్స్‌ అధికారిగా భానుప్రసాద్‌

తిరుపతి(విద్య), ఆగస్టు 8: తిరుపతి జిల్లా విద్యాశాఖ సైన్స్‌ అధికారిగా వడమాలపేట మండలంలోని తడుకు ఆర్‌ఎస్‌ జిల్లాపరిషత్‌ హైస్కూల్‌ సైన్స్‌ టీచర్‌ కె.భానుప్రసాద్‌ నియమితులయ్యారు. ఈమేరకు డీఈవో డాక్టర్‌ వి.శేఖర్‌ ఆయన్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఈ సందర్భంగా భానుప్రసాద్‌ మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగ కార్యక్రమాల్లో జిల్లాను ఉన్నతస్థాయిలో నిలిపేందుకు కృషిచేస్తానని.. కాగా తనకు అవకాశం కల్పించిన డీఈవో, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2022-08-09T07:32:56+05:30 IST