పోలీసుశాఖలో ఇద్దరికి ఉత్తమ సేవా పతకాలు
ABN , First Publish Date - 2022-08-15T08:12:54+05:30 IST
జిల్లా పోలీసుశాఖలో విశేష సేవలందించిన పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది.

మరో 11 మందికి సేవా పతకాలు
చిత్తూరు, ఆగస్టు 14: జిల్లా పోలీసుశాఖలో విశేష సేవలందించిన పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఇందులో ఏఆర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డి, పుంగనూరు రూరల్ సీఐ మధుసూదన్‌రెడ్డికి ఉత్తమ సేవా పతకాలను ప్రకటించింది. కార్వేటినగరం సీఐ చంద్రశేఖర్, బంగారుపాళ్యం సీఐ నరసింహారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏఎ్‌సఐ దేవప్రసాద్, పుంగనూరు అర్బన్ ఏఎ్‌సఐ వెంకటరత్నం, గుడిపాల ఏఎ్‌సఐ మునివేలు, నిండ్ర హెచ్‌సీ విలియమ్స్, డీసీఆర్బీ హెచ్‌సీ జగదీష్, స్పెషల్ బ్రాంచ్ హెచ్‌సీ మురళీకృష్ణ, చౌడేపల్లె హెచ్‌సీ రవికుమార్, ఏఆర్ హెచ్‌సీలు ధనరాజ్, మధుసూదన్‌కు సేవాపతకాలను ప్రకటించింది.