రుక్మిణికి ఉత్తమ ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రోగ్రామింగ్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-09-26T06:17:46+05:30 IST

స్థానిక ఎన్‌పీ సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఎన్‌ఎ్‌సఎస్‌ అధికారిణి రుక్మిణి పుల్లేపునకు ఉత్తమ జాతీయ స్థాయి ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రోగ్రామింగ్‌ అవార్డు లభించింది.

రుక్మిణికి ఉత్తమ ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రోగ్రామింగ్‌ అవార్డు
జాతీయ ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రోగ్రామింగ్‌ అవార్డులతో రుక్మిణి

చిత్తూరు (సెంట్రల్‌), సెప్టెంబరు 25: స్థానిక ఎన్‌పీ సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఎన్‌ఎ్‌సఎస్‌ అధికారిణి రుక్మిణి పుల్లేపునకు ఉత్తమ జాతీయ స్థాయి ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రోగ్రామింగ్‌ అవార్డు లభించింది. ఈమె సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమేగాక ఆరోగ్య సమస్యలు, పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించినందుకు గాను 2019-20 సంవత్సరానికి ఎన్‌ఎ్‌సఎస్‌ జాతీయ అవార్డు పొందారు. ఎన్‌సీసీ డే సందర్భంగా శనివారం మచిలీపట్నంలోని కృష్ణ యూనివర్సిటీ నుంచి ఆమె అవార్డు అందుకు న్నారు. జాతీయ అవార్డు రావడంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. 


Read more