ఉద్యోగుల సేవలకు ఉత్తమ పురస్కారాలు

ABN , First Publish Date - 2022-08-16T06:57:55+05:30 IST

విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరచిన జిల్లా అధికారులు, ఉద్యోగులకు ఇన్‌చార్జి మంత్రి ఉష శ్రీచరణ్‌ సోమవారం చిత్తూరు పోలీసు పరేడ్‌ మైదానంలో పురస్కారాలు అందజేశారు.

ఉద్యోగుల సేవలకు ఉత్తమ పురస్కారాలు
మంత్రి ఉషశ్రీచరణ్‌ నుంచి జ్ఞాపిక అందుకుంటున్న డీఆర్వో ఎస్‌.రాజశేఖర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 15: విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరచిన జిల్లా అధికారులు, ఉద్యోగులకు ఇన్‌చార్జి మంత్రి ఉష శ్రీచరణ్‌ సోమవారం చిత్తూరు పోలీసు పరేడ్‌ మైదానంలో పురస్కారాలు అందజేశారు. 70శాఖలకు సంబంధించిన 542 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. ఇందులో అధికంగా జిల్లా పోలీసు కార్యాలయానికి చెందిన 89 మంది సిబ్బంది ఉన్నారు. 

పోలీసులకు సేవా పతకాలను అందించిన జిల్లా ఇన్‌ ఛార్జీ మంత్రి

చిత్తూరు, ఆగస్టు 15: జిల్లా పోలీస్‌ శాఖలో విశిష్ట సేవలందించిన పోలీస్‌ అఽధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. అవార్డులకు ఎంపికైన వారికి జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రి ఉష శ్రీచరణ్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో జరిగిన వేడుల్లో ఆహుతుల మధ్య మంత్రి మెడల్స్‌ను అందించారు.

Updated Date - 2022-08-16T06:57:55+05:30 IST