తిరుమలలో అరణ్యకాండ పారాయణ దీక్ష ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-26T06:13:05+05:30 IST

సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని కోరుతూ తిరుమల వసంతమండపంలో అరణ్యకాండ పారాయణ దీక్ష శనివారం ప్రారంభమైంది.

తిరుమలలో అరణ్యకాండ పారాయణ దీక్ష ప్రారంభం

తిరుమల, జూన్‌25(ఆంధ్రజ్యోతి): సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని కోరుతూ తిరుమల వసంతమండపంలో అరణ్యకాండ పారాయణ దీక్ష శనివారం ప్రారంభమైంది. జూలై 10వ తేదీ వరకు ఈ పారాయణం జరుగనుంది. ఈ సందర్భంగా ధర్మగిరి వేదవిజ్ఞానపీఠం ప్రిన్సిపాల్‌ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం టీటీడీ షోడశదిన సుందరకాండ పారాయణం, బాలకాండ, అయోధయకాండ, యుద్ధకాండ పారాయణం నిర్వహించినట్లు తెలిపారు. అరణ్యకాండలో 75 సర్గల్లో 2,454 శ్లోకాలు ఉన్నాయని తెలిపారు. మొదటిరోజు శనివారం 1 నుంచి 2వ సర్గ వరకు ఉన్న 48 శ్లోకాలను 16 మంది వేదపండితులు పారాయణం చేసినట్టు తెలిపారు. అలాగే ధర్మగిరి వేదపాఠశాలలో 16 మంది ఉపాసకులు ఉదయం, సాయంత్రం వేళల్లో హోమాలు, జపాలు, హనుమంత, సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడి మూలమంత్రానుష్టానం జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 32 మంది వేదపండితుల్లో పాల్గొంటున్నారని వివరించారు.

Updated Date - 2022-06-26T06:13:05+05:30 IST