మదనపల్లెలో 25న బీసీ మహాసభ

ABN , First Publish Date - 2022-01-22T06:58:58+05:30 IST

బీసీ మహాసభను ఈనెల 25న మదనపల్లెలో నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తెలిపారు.

మదనపల్లెలో 25న బీసీ మహాసభ

తిరుపతి(కొర్లగుంట), జనవరి 21: దక్షిణాది తొలి బీసీ మహాసభను ఈనెల 25న మదనపల్లెలో నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జె.శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. సభకు ముఖ్యఅతిథిగా జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, కన్వీనర్‌ గుజ్జుకృష్ణ, ఇతర ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. బీసీల కులగణన చేపట్టాలని, చట్టసభల్లో రిజర్వేషన్‌ కల్పించాలని, బీసీలకు సబ్‌ప్లాన్‌ కింద బడ్జెట్‌లో రూ.2లక్షల కోట్లు కేటాయించాలని, తదితర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి , తీర్మానం చేస్తామన్నారు. అనంతరం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. బీసీ నాయకులు రెడ్డికుమార్‌, శ్రీనివాసులు, రెడ్డెప్ప, తనూజ, లోహిత్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-22T06:58:58+05:30 IST