చిరుధాన్యాల సాగుతో సమతుల పోషకాహారం

ABN , First Publish Date - 2022-03-05T07:22:58+05:30 IST

ఆహారభద్రత, పోషణలోపం, గ్రామీణ పేదరికాన్ని పారదోలడానికి వ్యవసాయవిద్యలో సమూల మార్పులు అవసరమని గవర్నరు బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు.

చిరుధాన్యాల సాగుతో సమతుల పోషకాహారం
జాతీయ వర్షాధారప్రాంత ప్రాధికారసంస్థ సీఈవో అశోక్‌ దళ్వాయికి డాక్టరేట్‌ ప్రదానం చేస్తున్న వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి

జాతీయ వర్షాధార ప్రాంతప్రాధికార సంస్థ సీఈవో అశోక్‌దల్వాయి 

ఘనంగా వ్యవసాయ వర్సిటీ 51వ స్నాతకోత్సవం 


తిరుపతి(విద్య), మార్చి 4: ఆహారభద్రత, పోషణలోపం, గ్రామీణ పేదరికాన్ని పారదోలడానికి వ్యవసాయవిద్యలో సమూల మార్పులు అవసరమని గవర్నరు బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 51వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.వర్చువల్‌గా హాజరైన గవర్నరు మాట్లాడుతూ వర్సిటీ పరిధిలోని కృషివిజ్ఞాన కేంద్రాల్లో వైవిద్యభరితమైన వనరులు వినియోగించుకునేలా సేంద్రియవ్యవసాయం, మిద్దెతోటలు, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం, చిరుఽధాన్యాల ఉత్పత్తి, వ్యవసాయ పత్రికా రచనలో సర్టిఫికెట్‌ కోర్సులు ప్రారంభించడం అభినందనీయమన్నారు.ముఖ్యఅతిథి అయిన జాతీయ వర్షాధార ప్రాంతప్రాధికార సంస్థ సీఈవో అశోక్‌దల్వాయి మాట్లాడుతూ  తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, అపరాలు, వర్షాధార ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తే.. సమతుల పోషక విలువలతో కూడిన ఆహార ఉత్పత్తులు పొందవచ్చని  పేర్కొన్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 51వ స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. గవర్నర్‌ బిష్వభూషన్‌ హరిచందన్‌ వర్చువల్లో ఉపన్యాసమిచ్చారు.  అశోక్‌దల్వాయి మాట్లాడుతూ.. దేశ ఆహార ధాన్యాల ఉత్పత్తుల్లో వరి, గోధుమలే సింహభాగమని చెప్పారు. దీనివల్ల సాగునీటి వినియోగం పెరిగి ఇతర ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గిందన్నారు. వ్యవసాయరంగంలో అభివృద్ధి సాధించాలంటే పంటల సాగుతో పాటు పశుపోషణ, పాల ఉత్పత్తి, మత్స్య పరిశ్రమలవైపు దృష్టిసారించాలని సూచించారు. వర్సిటీలో అనుసరిస్తున్న మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ధరల అంచనా, ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాల ఏర్పాటు, డ్రోన్ల వాడకం, ఏరువాక కేంద్రాలు, కేవీకేల ద్వారా రైతులకు అందిస్తున్న శిక్షణ, ఆర్బీకేలతో పనిచేస్తున్న తీరును అభినందించారు. వీసీ డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు పరిశోధనలకు అవసరమైన సాంకేతికతను పరిచయం చేయడానికి అమెరికా, ఐరోపా దేశాలకు పంపి.. పాశ్చాత్య పరిశోధన విధానాలను తెలుసుకునేలా చేస్తున్నామన్నారు. దీనివల్ల 2021 సంవత్సరానికి ఐసీఆర్‌ ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో 11వ స్థానానికి వర్సిటీ చేరిందని, ఈ స్థానాన్ని పదిలోపు తీసుకురావడమే లక్ష్యమన్నారు. పాలకమండలి సభ్యులు సీహెచ్‌ శ్రీనివాసరావు, వి.శ్రీనివాసరావు, జాగర్లమూడి లక్ష్మి, లక్క విజయభాస్కర్‌, పీకే సంజీవయ్య, టీవీ మురళీనాథరెడ్డి, మూకల కస్తూరి, పి.దేవుళ్లు, భత్సు శ్రీనివాసరావు, వెంకటరామ్‌మునిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వర్సిటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ గిరిధరకృష్ణ, అధికారులు పాల్గొన్నారు. 


665మందికి డిగ్రీలు.. బంగారు పతకాల ప్రదానం 

వివిధ యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు పూర్తిచేసిన 665 మందికి కాన్వొకేషన్‌ డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో బీఎస్సీ(అగ్రి)లో 481మందికి, పీజీలో 150 మందికి, పీహెచ్‌డీలో 34మంది అందుకున్నారు. అలాగే పీహెచ్‌డీలో కె.ప్రవీణ్‌, పి.మహేశ్వర్‌రెడ్డి, ఎన్‌.వెరోనిక, రాధిక రమ్య, పీజీలో కె.మౌనిక, జి.శిరీష, కె.భార్గవి, ఎ.మనీష, పీఏ అఖీష, మాధవ, నాగసత్యశ్రీ, రూపాలి నీలికాంత్‌, లీలావతి, అపర్ణలు బంగారుపతకాలు అందుకోగా ఎంఎస్‌ రాజునాయక్‌ పుస్తక పురస్కారం స్వీకరించారు.


పురస్కారాల ప్రదానం

ఉత్తమ ఉపాధ్యాయ, పరిశోధన, విస్తరణ శాస్త్రవేత్తల పురస్కారాలను ప్రధానం చేశారు. ఉపాధ్యాయ విభాగంలో తిరుపతిలో ఎస్వీ వ్యవసాయ కళాశాల అధ్యాపకుడు డాక్టర్‌ బి.రవీంద్రారెడ్డి, రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ ఎస్‌.హైమాజ్యోతి, బాపట్లలోని ఎన్టీఆర్‌ వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల అధ్యాపకుడు డాక్టర్‌ బి.శ్రీనివాసులు రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, మారటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్‌ వి.భువనేశ్వరి, డాక్టర్‌ ఎం శ్రీనివాస్‌, గుంటూరు లామ్‌ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ.సాంబయ్య ఉత్తమ పరిశోధన శాస్త్రవేత్త పురస్కారం అందుకున్నారు. గుంటూరులో లామ్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఒ.శారద (ఉత్తమ విస్తరణ శాస్త్రవేత్త), విజయ నగరం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త యు.త్రివేణి (ఎన్జీరంగా యువ శాస్త్రవేత్త) పురస్కారాలు అందుకున్నారు. అలాగే డాక్టర్‌ పి.వెంకటరమణారావు, డాక్టర్‌ బిందుమాధవి, డాక్టర్‌ ఎం.భరతలక్ష్మి, డాక్టర్‌ వి.వజంత, డాక్టర్‌ సీహెచ్‌ సీతారామలక్ష్మి, డాక్టర్‌ ఎన.అనురాధలు స్మారక పురస్కారాలు అందుకున్నారు. 

Updated Date - 2022-03-05T07:22:58+05:30 IST