ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృత్యువాత

ABN , First Publish Date - 2022-03-05T05:58:44+05:30 IST

కురబలకోట మండలం అంగళ్లు వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు.

ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృత్యువాత
రామ్మోహన (ఫైల్‌ ఫొటో)

పెద్దమండ్యం,మార్చి 4 :కురబలకోట మండలం అంగళ్లు వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు.పెద్దమండ్యం మండలం వెలిగల్లు పంచాయతీకి చెందిన నిమ్మనపల్లె కృష్ణప్ప కుమారుడు రామ్మోహన (36) ఏఆర్‌ కానిస్టేబుల్‌గా 2013లో చేరారు. ఏడాదిక్రితం మదనపల్లె ట్రాఫిక్‌ విభాగంలో చేరాడు. డ్యూటీలో భాగంగా బైక్‌పై వెళుతూ అంగళ్లు సమీపంలో ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందారు.శుక్రవారం ఆయన స్వగ్రామం పాపాతాగారిపల్లెలో ఏఆర్‌ పోలీసులు గౌరవ వందనం సమర్పించి అంత్యక్రియలు నిర్వహించారు.డీఎస్పీ రవిమనోహరాచారి, పోలీసు అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్‌, ఎంటీవో నాగభూషణం, ముదివేడు ఎస్‌ఐ సుకుమార్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐలు సుభాన్‌నాయక్‌, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T05:58:44+05:30 IST