ఏపీపీజీఈ సెట్‌ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2022-08-04T06:46:59+05:30 IST

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టిన ఏపీపీజీఈ సెట్‌-2022 ఫలితాలు విడుదలయ్యాయి.

ఏపీపీజీఈ సెట్‌ ఫలితాలు విడుదల
ఫలితాలను విడుదల చేస్తోన్న వీసీ రాజారెడ్డి

86 శాతం ఉత్తీర్ణత


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఆగస్టు 3: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టిన ఏపీపీజీఈ సెట్‌-2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్వీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కె.రాజారెడ్డి తన చాంబర్‌లో బుధవారం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఏపీపీజీఈ సెట్‌కు ఈ ఏడాది 5,703 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. వీరిలో 4,598 మంది పరీక్షలు రాయగా.. 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. పరీక్షలు నిర్వహించిన 13 రోజుల్లో ఫలితాలు విడుదల చేసిన సిబ్బందిని అభినందించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎస్వీయూకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఏపీపీజీఈ సెట్‌ కన్వీనర్‌ ఆర్వీఎస్‌ సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 18 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామని, త్వరలోనే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల అవుతుందన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్‌ హుస్సేన్‌, మీడియా కో-ఆర్డినేటర్స్‌ ప్రొఫెసర్‌ పీసీ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్‌ కుసుమ హరినాథ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T06:46:59+05:30 IST