ఏపీ ఎన్‌జీవో సంఘం జిల్లా కార ్యవర్గం ఎన్నిక

ABN , First Publish Date - 2022-12-12T00:02:15+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌(ఏపీ ఎన్‌జీవో) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం ఎన్‌జీవో భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా అసోసియేషన్‌ వైఎస్సార్‌ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు వ్యవహరించారు.

ఏపీ ఎన్‌జీవో సంఘం జిల్లా కార ్యవర్గం ఎన్నిక
గాంధీ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళుతున్న ఎన్‌జీవో సంఘం నేతలు

చిత్తూరు, డిసెంబరు 11: ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌(ఏపీ ఎన్‌జీవో) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం ఎన్‌జీవో భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా అసోసియేషన్‌ వైఎస్సార్‌ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా కేవీ రాఘవులు(సూపరింటెండెంట్‌, జిల్లా పశుసంవర్థకశాఖ), అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా మురళీకృష్ణ(సీనియర్‌ అసిస్టెంట్‌, డీఎంఅండ్‌హెచ్‌వో), ఉపాధ్యక్షులుగా బాలసుబ్రహ్మణ్యం( సీనియర్‌ అకౌంటెంట్‌, సబ్‌ ట్రెజరీ, బంగారుపాళ్యం), లక్ష్మీపతి(సీనియర్‌ అసిస్టెంట్‌, పీఆర్‌ఐ సబ్‌ డివిజన్‌, పలమనేరు), వరప్రసాద్‌(సీనియర్‌ అసిస్టెంట్‌, ఎస్వీ ఆర్‌ఆర్‌జీజీ హాస్పిటల్‌, తిరుపతి), పురుషోత్తంరెడ్డి(సీనియర్‌ అసిస్టెంట్‌, రవాణా శాఖ, పుంగనూరు), రెడెడ్డప్పన్‌(ఆర్‌ఐ, కార్వేటినగరం) ఎన్నికయ్యారు. సెక్రటరీగా రఘు(సీనియర్‌ అసిస్టెంట్‌, జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం), ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా ప్రదీ్‌ప(ప్రభుత్వ ఐటీఐ, చిత్తూరు), జాయింట్‌ సెక్రటరీలుగా రమే్‌ష(సీపీవో కార్యాలయం), మహేష్‌ కుమార్‌(పీహెచ్‌సీ, తూగుండ్రం), సురేష్‌ కుమార్‌( ఆర్‌అండ్‌బీ, హైవేస్‌, చిత్తూరు), సురే్‌ష(సెరికల్చర్‌, చిత్తూరు), సునీత(పీహెచ్‌సీ, పీలేరు), ట్రెజరర్‌గా మురళీ మోహన్‌(డీఈవో కార్యాలయం, చిత్తూరు) ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని ఎన్నికల అధికారి శ్రీనివాసులు తెలిపారు. అంతకుముందు ఎన్‌జీవో భవనం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.

Updated Date - 2022-12-12T00:02:15+05:30 IST

Read more