ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2022-11-21T01:12:14+05:30 IST

ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఎస్‌ఆర్‌పురం మండలం 49.కొత్తపల్లెమిట్ట చర్చి వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
హేమశేఖర్‌ (ఫైల్‌)

ఒకరి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు

శ్రీరంగరాజపురం, నవంబరు 20: ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఎస్‌ఆర్‌పురం మండలం 49.కొత్తపల్లెమిట్ట చర్చి వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ షేక్షావలి చెప్పిన వివరాల మేరకు.. వెదురుకుప్పం మండలం మారేపల్లికి చెందిన కాలేయ్య కుమారుడు హేమశేఖర్‌(20), అయ్యప్ప (22) ఆదివారం రాత్రి చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ఉన్న బంధువులను చూసేందుకు బైక్‌పై వెళుతున్నారు. ఎస్‌ఆర్‌పురం మండలం 49.కొత్తపల్లెమిట్ట చర్చి వద్ద చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. హేమశేఖర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అయ్యప్ప గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని హేమశేఖర్‌ మృతదేహాన్ని, గాయపడిన అయ్యప్పను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ షేక్షావలి తెలిపారు.

Updated Date - 2022-11-21T01:12:14+05:30 IST

Read more