-
-
Home » Andhra Pradesh » Chittoor » Ammaodi funeral for the poor-NGTS-AndhraPradesh
-
నిరుపేదకు ‘అమ్మఒడి’ అంత్యక్రియలు
ABN , First Publish Date - 2022-09-11T05:53:02+05:30 IST
స్థానిక వైఎ్‌సఆర్ కాలనీకి చెందిన నాగరాజు అనారోగ్య కారణంగా శనివారం మృతి చెందారు.

చిత్తూరు రూరల్, సెప్టెంబరు 10: స్థానిక వైఎ్‌సఆర్ కాలనీకి చెందిన నాగరాజు అనారోగ్య కారణంగా శనివారం మృతి చెందారు. కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించే స్థోమత తనకు లేదని, సహకరించాలని నాగరాజు తండ్రి శ్రీహరి అమ్మఒడిని ఆశ్రయించారు. స్పందించిన అమ్మఒడి నిర్వాహకుడు పద్మనాభనాయుడు దగ్గరుండి నాగరాజు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు అమ్మఒడి బృందాన్ని అభినందించారు.