ఆకాశగంగ... శివుని అభిషేకించంగ

ABN , First Publish Date - 2022-11-14T00:05:07+05:30 IST

శివలింగాన్ని స్పృసించిన జలపాతం

ఆకాశగంగ... శివుని అభిషేకించంగ
శివలింగాన్ని అభిషేకిస్తున్న జలపాతం

ఆ ఆకాశగంగ స్వయంగా దివినుంచి దిగివచ్చి పరమశివుని అభిషేకిస్తున్నట్లు కనిపిస్తున్న ఈ దృశ్యం శ్రీకాళహస్తి మండలంలో విస్తరించి ఉన్న కైలాసగిరుల్లో వేడాం సమీపంలోని భైరవకోన లోనిది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కైలాసగిరుల్లోని జలపాతాలు జాలువారుతున్నాయి. వేడాం సమీంపలోని దక్షిణకాళికాదేవి ఆలయానికి ఎగువన ఉన్న భైరవకోనలో జలపాతం ఇలా కొండరాళ్ల నుంచి జాలువారుతూ ఇక్కడ వెలసిన శివలింగాన్ని స్పృసించి ఇలా కిందికి జారిపోతోంది. ఈ అద్వితీయ దృశ్యం భైరవకోనను సందర్శించే భక్తులకు కనువిందు చేస్తోంది.

- శ్రీకాళహస్తి

Updated Date - 2022-11-14T00:05:09+05:30 IST