ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-10T07:06:18+05:30 IST

శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో 2022-23సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.సుధాకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

తిరుపతి(కొర్లగుంట), జూలై 9: శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో 2022-23సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.సుధాకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. గాత్రం, వయోలిన్‌, వీణ, వేణువు, మృదంగం, భరతనాట్యం, హరికథ, నాదస్వరం, డోలు, ఘటం వివిధ సంగీత, నృత్య విభాగాలలో అడ్మిషన్లు మొదలయ్యాయి. 8వ తరగతి ఉత్తీర్ణులై, 13 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు పుల్‌టైమ్‌ రెగ్యులర్‌ డే కాలేజీలో చేరుటకు అర్హులు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5వరకు తరగుతులు ఉంటాయి. విశారద డిప్లొమా 3సంవత్సరాలు. ఏడాదికి ఫీజు రూ.3,025. ప్రవీణ అడ్వాన్సుడు డిప్లొమా 2సంవత్సరాలకు ఫీజు రూ. 3,025. 20 కిలోమీటర్లు పైబడిన దూరప్రాంత విద్యార్థులకు ఉచిత భోజనం, హాస్టల్‌ వసతి కల్పిస్తారు. అడ్మిషన్లకు ఆగస్టు 31 వరకు గడువు విధించారు. బి.మ్యూజిక్‌, బి.డాన్స్‌ యూజీ డిగ్రీ కోర్సులలో చేరే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వారి నోటిఫికేషన్‌ వెలువడిన తరువాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  దీనికి ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై 17 నుంచి 25సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. ఎంఏ మ్యూజిక్‌, ఎంఏ డాన్స్‌ పీజీ కోర్సులలో గాత్రం, వయోలిన్‌, వీణ, భరతనాట్యం, చేరదలుచుకున్న అభ్యర్థులు ఎస్వీయూ ద్వారా పీజీసెట్‌ పరీక్షలలో అర్హత సాధించాలి. మరిన్ని వివరాలకు 0877-2264597, 9391599995 నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. 

Updated Date - 2022-07-10T07:06:18+05:30 IST