తిరుమల ప్రయాణంలో ప్రమాదం

ABN , First Publish Date - 2022-10-02T05:42:06+05:30 IST

డక్కిలి మండలం వెలికల్లు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లెకు చెందిన వడ్రంగి దైవజ్ఞాచారి (45) మృతి చెందాడు.

తిరుమల ప్రయాణంలో ప్రమాదం
వెలికల్లు వద్ద రహదారిపై దైవజ్ఞాచారి మృతదేహం

డక్కిలి, అక్టోబరు 1 : డక్కిలి మండలం వెలికల్లు వద్ద  శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లెకు చెందిన వడ్రంగి దైవజ్ఞాచారి (45) మృతి చెందాడు.పోలీసుల కథనం ప్రకారం... రాపూరు మండలం కలుజుగుంటకు చెందిన టి.పెంచలయ్య, చల్లా చెంచయ్య మద్యం మత్తులో కారులో వెంకటగిరి నుంచి రాపూరుకు వస్తున్న క్రమంలో వెలికల్లు వద్ద ఎదురుగా వస్తున్న బైకును ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న దైవజ్ఞాచారి అక్కడికక్కడే మృతి చెందగా వెనక కూర్చొని వున్న కోటంరెడ్డి వెంకటకృష్ణారెడ్డికి రెండు కాళ్లూ విరిగిపోయాయి. ప్రథమచికిత్స అనంతరం నెల్లూరుకు తరలించారు. దైవజ్ఞాచారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. నయం కావడంతో తన గ్రామానికి చెందిన మిత్రుడు వెంకటకృష్ణారెడ్డిని వెంటబెట్టుకుని బైక్‌లో తిరుమలకు బయల్దేరాడు.మార్గమధ్యంలోనే మృత్యుఒడికి జారుకున్నాడు.ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more