సూళ్లూరుపేటలో ఏసీబీ కలకలం

ABN , First Publish Date - 2022-08-04T06:47:04+05:30 IST

సూళ్లూరుపేట మున్సిపల్‌ కార్యాలయంపై బుధవారం మధ్యాహ్నం అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడి చేశారు.

సూళ్లూరుపేటలో ఏసీబీ కలకలం
మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

 మున్సిపల్‌ కార్యాలయంపై దాడుల్లో రూ.1.93 లక్షల స్వాధీనం \


సూళ్లూరుపేట, ఆగస్టు 3 : సూళ్లూరుపేట మున్సిపల్‌ కార్యాలయంపై బుధవారం మధ్యాహ్నం అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడి చేశారు. ఏసీబీ డీఎస్పీ జీఆర్‌ఆర్‌ మోహన్‌ ఆధ్వర్యంలో 10మంది సిబ్బంది 11.30 గంటలకు కార్యాలయాన్ని ఒక్కసారిగా చుట్టుముట్టారు. కమిషనర్‌ నరేంద్రకుమార్‌ గది కిటికీ బయట రూ.1.13 లక్షలు నగదు పడి ఉన్నట్లు గుర్తించారు. కమిషనర్‌ కారులో రూ.50వేలు, ఆయన గదిలో మరో రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యాలయంపై 14400 నెంబరుకు స్పందనయాప్‌ ద్వారా ఫిర్యాదులు అందినట్లు సమాచారం.టౌన్‌ప్లానింగ్‌, అక్రమ కట్టడాలపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది.ఏసీబీ అధికారులు రాత్రి పొద్దుపోయేవరకు కార్యాలయంలో రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.గురువారం తనిఖీలు కొనసాగనున్నట్లు సమాచారం.డీఎస్పీతోపాటు సీఐలు రమేష్‌బాబు, వేణు, శ్రీనివాస్‌, కిరణ్‌ తనిఖీల్లో పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T06:47:04+05:30 IST