ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌గా ఏసీకి అదనపు బాధ్యతలు

ABN , First Publish Date - 2022-10-08T05:13:26+05:30 IST

ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కోఆర్డినేటర్‌గా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ గురుస్వామిరెడ్డికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌గా ఏసీకి అదనపు బాధ్యతలు

చిత్తూరు (సెంట్రల్‌), అక్టోబరు 7: ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కోఆర్డినేటర్‌గా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ గురుస్వామిరెడ్డికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న వరప్రసాద్‌రెడ్డి అన్నమయ్య జిల్లాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. 2021-22 విద్యాసంవత్సరం వరకు పోస్టును కొనసాగించడంతో ఆయన డిప్యుటేషన్‌పై పనిచేశారు. తాజా ఉత్తర్వుల మేరకు వరప్రసాద్‌రెడ్డిని అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం జడ్పీ ఉన్నత పాఠశాలోని స్కూల్‌ అసిస్టెంట్‌ (తెలుగు)గా రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ డీఈవో రిలీవ్‌ చేశారు. ఖాళీగా ఏర్పడిన ఈ స్థానాన్ని పరీక్షల సహాయ కమిషనర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. 


15కు ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల పొడిగింపు 


2022-23 విద్యా సంవత్సరానికి టెన్త్‌, ఇంటర్‌ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదువుకునేందుకు అడ్మిషన్ల తేదీలను ఈనెల 15కు పొడిగించినట్లు డీఈవో పురుషోత్తం, కోఆర్డినేటర్‌ గురుస్వామిరెడ్డి తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏపీ ఆన్‌లైన్‌, మీసేవా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు రుసుం చెల్లించాలన్నారు. 

Updated Date - 2022-10-08T05:13:26+05:30 IST