గొర్రెను మింగబోయిన కొండచిలువ

ABN , First Publish Date - 2022-10-10T04:54:36+05:30 IST

గుడుపల్లె మండలంలోని కుప్పిగానిపల్లె సమీప అటవీ ప్రాంతంలో గొర్రెను కొండచిలువ మింగబోయింది

గొర్రెను మింగబోయిన కొండచిలువ
బోడిబండవంకలో కొండచిలువ

గుడుపల్లె, అక్టోబరు 9: మండలంలోని కుప్పిగానిపల్లె సమీప అటవీ ప్రాంతంలో గొర్రెను కొండచిలువ మింగబోయింది.  కుప్పిగానిపల్లె చెందిన జేజప్ప ఆదివారం ఉదయం  గొర్రెల మందతో అటవీ ప్రాంతమైన బోడిబండవంకకు తోలుకెళ్లాడు. సాయంత్రం జేజప్ప  గొర్రెలు గుంపుగా చేరి అరవడంతో అక్కడకు వెళ్లి చూశాడు. మందలోని  గొర్రెను కొండచిలువ మింగటానికి ప్రయత్నిస్తుండడంతో... జేజప్ప తన దగ్గర ఉన్న పెద్దకర్ర సాయంతో గొర్రెను కొండచిలువ నుండి తప్పించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు అటవీశాఖ సిబ్బందికి తెలిపారు. సిబ్బంది బోడిడండవంకకు చేరుకుని కొండచిలువను పట్టుకుని  దట్టమైన అడవీ ప్రాంతంలో వదిలి పెట్టారు.

Updated Date - 2022-10-10T04:54:36+05:30 IST