జాతీయ రహదారిపై ఒంటరి ఏనుగు హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-12-31T00:17:53+05:30 IST

పలమనేరు- చిత్తూరు జాతీయ రహదారిపై పలమనేరు పట్టణానికి కూతవేటు దూరంలో ఒంటరి ఏనుగు హల్‌చల్‌ సృష్టించింది.

జాతీయ రహదారిపై ఒంటరి ఏనుగు హల్‌చల్‌
రోడ్డుదాటుతున్న ఒంటరిఏనుగు

గంగవరం, డిసెంబరు 30: పలమనేరు- చిత్తూరు జాతీయ రహదారిపై పలమనేరు పట్టణానికి కూతవేటు దూరంలో ఒంటరి ఏనుగు హల్‌చల్‌ సృష్టించింది. శుక్రవారం సాయంత్రం గంటావూరు కాలనీ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామిగుడి వెనుక ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఒంటరి ఏనుగు రోడ్డుపైకి వచ్చింది. అటూఇటూ వాహనాలు వస్తుండడంతో రోడ్డుపైనే ఆగిపోయింది. ఏనుగు కదలకుండా అలాగే నిలబడి ఉండడంతో వాహన చోదకులు మిన్నకుండిపోయారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది, ట్రాకర్స్‌ అక్కడికి చేరుకున్నారు. వారి చర్యలను గమనించిన ఏనుగు మెల్లగా రోడ్డు దాటి గాంధీనగర్‌ అటవీ ప్రాంతంవైపు వెళ్లిపోయింది.

Updated Date - 2022-12-31T00:17:55+05:30 IST