జాతీయ రహదారిపై ఒంటరి ఏనుగు

ABN , First Publish Date - 2022-12-31T01:55:17+05:30 IST

పలమనేరు పట్టణానికి కూతవేటు దూరంలో జాతీయ రహదారిపై ఒంటరి ఏనుగు హల్‌చల్‌ చేసింది. శుక్రవారం సాయంత్రం గంటావూరు కాలనీ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామిగుడి వెనుక ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఈ ఏనుగు రోడ్డుపైకి వచ్చింది.

జాతీయ రహదారిపై ఒంటరి ఏనుగు

గంగవరం, డిసెంబరు 30: పలమనేరు పట్టణానికి కూతవేటు దూరంలో జాతీయ రహదారిపై ఒంటరి ఏనుగు హల్‌చల్‌ చేసింది. శుక్రవారం సాయంత్రం గంటావూరు కాలనీ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామిగుడి వెనుక ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఈ ఏనుగు రోడ్డుపైకి వచ్చింది. అటూఇటూ వాహనాలు వస్తుండడంతో రోడ్డుపైనే ఆగిపోయింది. ఏనుగు కదలకుండా నిలబడి ఉండడంతో వాహన చోదకులు మిన్నకుండిపోయారు. అటవీ శాఖ సిబ్బంది, ట్రాకర్లు అక్కడికి చేరుకున్నారు. వారి చర్యలను గమనించిన ఏనుగు మెల్లగా రోడ్డు దాటి గాంధీనగర్‌ అటవీ ప్రాంతంవైపు వెళ్లిపోయింది.

Updated Date - 2022-12-31T01:55:17+05:30 IST

Read more