కూలిన నిర్మాణంలోని భవనం

ABN , First Publish Date - 2022-09-13T06:26:32+05:30 IST

నిర్మాణంలో వున్న భవనం ఆకస్మికంగా కూలింది.

కూలిన నిర్మాణంలోని భవనం
నేలమట్టమైన భవనం

తప్పిన పెను ప్రమాదం


ఎర్రావారిపాలెం, సెప్టెంబరు 12: నిర్మాణంలో వున్న భవనం ఆకస్మికంగా కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎర్రావారిపాలెం మండలంలోని కమళ్లయ్యగారిపల్లె పంచాయతీ పచ్చార్లవాండ్లపల్లెకి చెందిన కానాల సుబ్రమణ్యం రెడ్డి తన ఇంటి వెనుక పశువుల కోసం భవనం నిర్మించారు. ఆ భవనంపై ఆర్‌సీసీ స్లాబ్‌ వేశాడు. పునాదులు కుంగడంతో భవనం ఒక్కసారిగా కూలిపోయింది. అప్పుడక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కూలడానికి గంట ముందే పాడి పశువుల నుంచి పాలు తీసి దూరంగా కట్టారు. ఈ ఘటనలో  రూ.15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని తెలిపారు.

Read more