చిత్తూరుకు 894, తిరుపతికి 110 పోస్టులు

ABN , First Publish Date - 2022-12-16T01:15:18+05:30 IST

చిత్తూరు పోలీస్‌ యూనిట్‌లో 894, తిరుపతిలో 110 పోస్టులు భర్తీ కానున్నాయి. గతనెల 28వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌లో భాగంగా ఈమేరకు పోస్టులను కేటాయించారు.

చిత్తూరుకు 894, తిరుపతికి 110 పోస్టులు

‘కానిస్టేబుల్‌, ఎస్‌ఐ’ నోటిఫికేషన్‌లో కేటాయింపు

తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 15: చిత్తూరు పోలీస్‌ యూనిట్‌లో 894, తిరుపతిలో 110 పోస్టులు భర్తీ కానున్నాయి. గతనెల 28వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌లో భాగంగా ఈమేరకు పోస్టులను కేటాయించారు. నోటిఫికేషన్‌ ప్రకారం.. చిత్తూరుకు 240 సివిల్‌ పోలీసు పోస్టులతోపాటు చిత్తూరులో కొత్తగా ఏర్పాటుచేయనున్న ఇండియా రిజర్వ్‌ (ఐఆర్‌) బెటాలియన్‌కు 630 కానిస్టేబుల్‌ పోస్టులు, 24 ఆర్‌ఎ్‌సఐ పోస్టులున్నాయి. తిరుపతి యూనిట్‌కు 110 పోస్టులు కేటాయించారు. ఈ లెక్కన తిరుపతి అర్బన్‌తో కూడిన చిత్తూరు ఉమ్మడి జిల్లాలో 1,004 పోస్టులు భర్తీ కానున్నాయి.

దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు:ఎస్పీ

దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు ఎస్పీ పరమేశ్వరరెడ్డి సూచించారు. సిఫారసులతో ఉద్యోగాలు రావని.. పరీక్షలు, ప్రతిభ, ఇంటర్వ్యూల ద్వారానే భర్తీ చేస్తారని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. దళారులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి దళారులపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2022-12-16T01:15:23+05:30 IST