జిల్లాకు ఎనిమిది సబ్ రిజిస్ట్రార్‌కార్యాలయాలు
ABN , First Publish Date - 2022-04-17T08:06:58+05:30 IST
కొత్త జిల్లాలకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల పరిధిలను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుపతికి 16, అన్నమయ్యకు 12 కేటాయింపు
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 16: కొత్త జిల్లాలకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల పరిధిలను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండేవి. వీటిలో అన్నమయ్య జిల్లాకు కలికిరి, మదనపల్లె, పీలేరు, తంబళ్ళపల్లె , వాల్మీకిపురం. బి. కొత్తకోట కార్యాలయాలు వెళ్లాయి. చిన్నగొట్టిగల్లు ఎస్‌ఆర్వో తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చింది. అలాగే తిరుపతి శ్రీబాలాజి రిజిస్ట్రారు జిల్లా పరిధి నుంచి నగరి, కారే ్వటి నగరం చిత్తూరు జిల్లా పరిధిలోకి వచ్చాయి. దీంతో అన్నమయ్య జిల్లాకు 12, చిత్తూరు జిల్లాకు 8, తిరుపతి జిల్లాకు అత్యధికంగా 16 ఎస్‌ఆర్వోలు నోటిఫై అయ్యాయి.
చిత్తూరు జిల్లా : బంగారుపాళ్యెం, చిత్తూరు ఆర్వో, చిత్తూరు రూరల్, కార్వేటి నగరం, కుప్పం, పలమనేరు, పుంగనూరు, నగరి.
తిరుపతిజిల్లా : గూడూరు, కోట, నాయుడుపేట, సూళ్ళూరు పేట, వెంకటగిరి, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, పాకాల, పిచ్చాటూరు, పుత్తూరు, రేణిగుంట, సత్యవేడు, శ్రీకాళహస్తీ, తొట్టంబేడు, తిరుపతి ఆర్వో, తిరుపతి రూరల్.
అన్నమయ్య జిల్లా: కలికిరి, మదనపల్లె, పీలేరు, తంబళ్ళపల్లె, వాల్మీకిపురం, బి. కొత్తకోట, టి. సుండుపల్లె, రాజంపేట, రాయచోటి ఆర్వో , చిట్వేల్, లక్కిరెడ్డిపల్లె, పుల్లంపేట .