రోడ్డు కోసం రోడ్డెక్కారు

ABN , First Publish Date - 2022-12-31T00:15:46+05:30 IST

ప్రభుత్వాలు మారినా తమ రాతలు మారలేదని, ఏళ్ళ తరబడి నాయకులు కేవలం ఓట్ల కోసం తప్ప తమ సమస్యలు పరిష్కరించిన వారు లేరంటూ 7 గ్రామాల ప్రజలు, 3 పాఠశాలల విద్యార్థులు పెద్దపంజాణిలో రోడ్డుపై బైఠాయించారు.

రోడ్డు కోసం రోడ్డెక్కారు
రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు, విద్యార్థులు

పెద్దపంజాణి, డిసెంబరు 30: ప్రభుత్వాలు మారినా తమ రాతలు మారలేదని, ఏళ్ళ తరబడి నాయకులు కేవలం ఓట్ల కోసం తప్ప తమ సమస్యలు పరిష్కరించిన వారు లేరంటూ 7 గ్రామాల ప్రజలు, 3 పాఠశాలల విద్యార్థులు పెద్దపంజాణిలో రోడ్డుపై బైఠాయించారు. పెద్దపంజాణి మండలంలోని చలమంగళం, లింగాపురం పంచాయతీలకు చెందిన చలమంగలం, సులేరుగుట్ట, పెద్దముద్దేపల్లె, చిన్నముద్దేపల్లె, కొత్తముద్దేపల్లె, వడ్డూరు ముద్దేపల్లె, గడ్డంవారిపల్లెలకు రోడ్డు సౌకర్యంలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో విద్యార్థులు పాఠశాలలకు హాజరు కాలేకపోయేవారు. ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం వచ్చిన ప్రతి నాయకుడు తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి గెలిచిన తరువాత మొఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. ఈక్రమంలో శుక్రవారం 7 గ్రామాల ప్రజలు, 3 పాఠశాలల విద్యార్థులు ర్యాలీగా వచ్చి ఎంపీడీవో కార్యాలయం ఎదుట పలమనేరు - పుంగనూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. అనంతరం ఎంపీడీవో శ్రీనివాస్‌కు వినతి పత్రం అందించారు. సంబందిత అధికారుల సహాయంతో సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

Updated Date - 2022-12-31T00:15:46+05:30 IST

Read more