మూడ్రోజుల్లో రూ.5.83కోట్లు ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం

ABN , First Publish Date - 2022-08-17T06:57:37+05:30 IST

ఆర్టీసీకి మూడ్రోజుల్లో రూ.5.83కోట్ల ఆదాయం లభించింది. శని, ఆది, సోమవారాలు వరుస సెలవులతో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిశాయి.

మూడ్రోజుల్లో రూ.5.83కోట్లు   ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం

తిరుపతి(కొర్లగుంట), ఆగస్టు 16: ఆర్టీసీకి మూడ్రోజుల్లో రూ.5.83కోట్ల ఆదాయం లభించింది. శని, ఆది, సోమవారాలు వరుస సెలవులతో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఇక వచ్చిన ఆదాయంలో సగభాగం తిరుమల ఘాట్‌లో తిరిగిన బస్సుల ద్వారానే రావడం విశేషం. గతంలో ఎన్నడూ లేని విధంగా శనివారం ఒక్క రోజే 3,001 ట్రిప్పులు తిరిగాయి. 1,14,941 (అప్‌ అండ్‌ డౌన్‌) మంది ప్రయాణికుల సంఖ్య కూడా టాప్‌గా నమోదైంది. ఆ ఒక్క రోజున రూ.1.04కోట్ల ఆదాయం వచ్చింది. దీనివెనుక సమష్టిగా పనిచేసిన అధికారులు, సిబ్బందికి ప్రజా రవాణాధికారి చెంగల్‌రెడ్డి అభినందనలు తెలిపారు. 13వ తేదీన రూ.1.85కోట్లు, , 14న రూ.2.04కోట్లు,15న రూ.1.94కోట్లు ఆదాయం లభించింది.తిరుమల ఘాట్‌లో మాత్రమే 13, 14, 15 తేదీల్లో  వచ్చిన ఆదాయం రూ.2.83కోట్లు. 7,524 ట్రిప్పులు బస్సులు తిప్పగా 3,10,562 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 



Updated Date - 2022-08-17T06:57:37+05:30 IST