శ్రీకాళహస్తీశ్వరాలయ అతిథి గృహానికి రూ.46లక్షలు విరాళం

ABN , First Publish Date - 2022-10-08T05:14:12+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన కైలాససదన్‌ అతిథిగృహ సముదాయంలోని ఒక బ్లాక్‌లోని నాలుగు గదులకు విజయవాడకు చెందిన సూరిశెట్టి సరస్వతమ్మ, కుటుంబసభ్యులు విన్నకోట స్వతంత్య్రబాబు, పర్వత వర్ధనమ్మ, కోటేశ్వరరావు రూ.46లక్షలు విరాళం అందజేశారు.

శ్రీకాళహస్తీశ్వరాలయ అతిథి గృహానికి రూ.46లక్షలు విరాళం
విరాళం అందజేస్తున్న దాత

శ్రీకాళహస్తి, అక్టోబరు 7: శ్రీకాళహస్తీశ్వరాలయ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన కైలాససదన్‌ అతిథిగృహ సముదాయంలోని ఒక బ్లాక్‌లోని నాలుగు గదులకు విజయవాడకు చెందిన సూరిశెట్టి సరస్వతమ్మ, కుటుంబసభ్యులు విన్నకోట స్వతంత్య్రబాబు, పర్వత వర్ధనమ్మ, కోటేశ్వరరావు రూ.46లక్షలు విరాళం అందజేశారు. ఈ సొమ్మును ఆలయ పాలకమండలి చైర్మన్‌ అంజూరు శ్రీనివాసులు స్వీకరించి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. వారికి స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ చైర్మన్‌ అంజూరు శ్రీనివాసులు వారిని ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కైలాససదన్‌లో మొత్తం 125 గదులు ఉన్నాయన్నారు. ఇందులో 101 సింగిల్‌ గదులు, 24 సూట్‌ రూమ్స్‌ ఉన్నాయన్నారు. ఒక్కొక్క సింగిల్‌ రూమ్‌కు రూ.8లక్షలు, సూట్‌ రూమ్‌కు రూ.15లక్షలు చొప్పున విరాళం చెల్లించి భక్తులు భాగస్వామ్యం అయ్యేలా దేవస్థానం అవకాశం కల్పించిందన్నారు. విరాళం అందజేసిన దాతలకు ఏడాదిలో 30 రోజులు ఉచిత బస కల్పిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు డీఈ మురళీధర్‌, అకౌంటెంట్‌ యుగంధర్‌, పాలకమండలి సభ్యులు పసల సుమతి, సాధన మున్నా, జయశ్యామ్‌, ప్రత్యేక ఆహ్వానితులు పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T05:14:12+05:30 IST