ఇంటింటి కొళాయి లక్ష్యం 36 శాతం పూర్తి
ABN , First Publish Date - 2022-10-08T05:23:16+05:30 IST
జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ కొళాయి కనెక్షన్ 36 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామని కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు.
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 7: జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ కొళాయి కనెక్షన్ 36 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామని కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈలు, ఏఈలతో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లీనిక్ భవన నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరం జలజీవన్ మిషన్ కింద 39,594 కొళాయి కనెక్షన్లకు గాను 14,364 కనెక్షన్లు ఇచ్చామన్నారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం 488 పనులు మంజూరు కాగా 457 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. డిసెంబరు 21న జగనన్న హౌసింగ్ లేఅవుట్లలో గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రభాకర్ రెడ్డి, పీఆర్ ఎస్‌ఈ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగజ్యోతి పాల్గొన్నారు.