ప్రాణదాన పథకానికి 201మంది ఎంపిక

ABN , First Publish Date - 2022-12-30T01:20:02+05:30 IST

స్విమ్స్‌లో పేద రోగులకు టీటీడీ ప్రాణదాన పథకం కింద ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు 201 మంది రోగులను ఎంపిక చేశారు. స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ అధ్యక్షతన గురువారం స్విమ్స్‌లో ప్రాణదాన కమిటీ సమావేశం నిర్వహించారు.

 ప్రాణదాన పథకానికి 201మంది ఎంపిక

తిరుపతి సిటీ, డిసెంబరు 29: స్విమ్స్‌లో పేద రోగులకు టీటీడీ ప్రాణదాన పథకం కింద ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు 201 మంది రోగులను ఎంపిక చేశారు. స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ అధ్యక్షతన గురువారం స్విమ్స్‌లో ప్రాణదాన కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ కోటిరెడ్డి,రుయాస్పత్రి ఇన్‌చార్జి సీఎ్‌సఆర్‌ఎంవో ఈబీ దేవి తదితరులు అర్హులను ఎంపిక చేశారు.

Updated Date - 2022-12-30T01:20:02+05:30 IST

Read more