ఫిబ్రవరిలో 10.96 లక్షల మందికి శ్రీవారి దర్శనం

ABN , First Publish Date - 2022-03-05T07:46:55+05:30 IST

ఫిబ్రవరి నెలలో 10,95,724 మంది భక్తులకు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కల్పించినట్టు టీటీడీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఫిబ్రవరిలో 10.96 లక్షల మందికి శ్రీవారి దర్శనం

హుండీ ద్వారా రూ.79.34 కోట్ల ఆదాయం: టీటీడీ


తిరుమల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరి నెలలో 10,95,724 మంది భక్తులకు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కల్పించినట్టు టీటీడీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా రూ.79.34 కోట్లు వచ్చాయి. 5.35లక్షల మంది తలనీలాలు సమర్పించగా, 13.63 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. దాదాపు 1.64 లక్షల గదులను భక్తులకు కేటాయించగా, 329.04 ఎంఎల్‌డీ నీటిని భక్తులు వినియోగించుకున్నారు. 27.76 లక్షల యూనిట్ల విద్యుత్‌ వినియోగమవగా, 64.90 లక్షల లడ్డూలను భక్తులకు అందజేసినట్లు’ టీటీడీ వెల్లడించింది. 

Updated Date - 2022-03-05T07:46:55+05:30 IST